Saturday, February 8, 2014

వేమన శతకము - ఉప్పు కప్పురంబు

వేమన శతకము
పద్యం: ఉప్పు కప్పురంబు




ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ!


uppu kappuraMbu nokka pOlika nuMDu
chUDa chUDa ruchula jADa vEru
puruShulaMdu puNya puruShulu vErayA
viSvadAbhirAma vinura vEma!

పద విభజన:
ఉప్పు + కప్పురంబును + ఒక్క + పోలికను + ఉండు + చూడ చూడ + రుచుల + జాడ + వేరు 
పురుషులందు + పుణ్య పురుషులు + వేరయా + విశ్వ + ద + అభిరామ + వినుర + వేమ. 

Individual Words: 
uppu, kappuraMbunu, okka, pOlikanu, uMDu; chUDa chUDa; ruchula; jADa; vEru; puruShulaMdu; puNya puruShulu; vErayA; viSva; da; abhirAma; vinura; vEma


అర్ధములు:
ఉప్పు (uppu) = ఉప్పు (salt) ; కప్పురంబు (kappuraMbu)  = కర్పూరము (camphor); ఒక్క (okka) = ఒకే (same); పోలిక (pOlika) = విధముగా/సామ్యము (resemble); చూడ చూడ (chUDa chUDa) = జాగ్రత్తగా చూడగా (as you see carefully) ; రుచుల = (tastes) ; జాడ = విధము (manner) ; వేరు (vEru) = తేడాగా (are different); పుణ్య పురుషులు (puNya puruShulu) = ఉత్తములు లేదా మంచివారు (good people); వేరయా (vErayA) = తేడాగా వుండును (are different); విశ్వ (viSva) = సమస్తమును; ద (da) = ఇచ్చునట్టి దేవునకు; అభిరామ (abhirAma) = ఇష్టుడవైన; వేమ (vEma) = ఓ వేమనా.   


తాత్పర్యము: సమస్తమును ఇచ్చునట్టి దేవునకు ఇష్టుడవైన ఓ వేమనా! ఉప్పు, కర్పూరము చూడటానికి ఒకే విధంగా వుంటాయి (రెండో తెల్ల రంగులో వుంటాయి). కాని వాటి రుచులు వేరేగా వుంటాయి (ఉప్పు ఉప్పగా వుంటుంది, కర్పూరం ఘాటుగా వుంటుంది). అలాగే మనుషులు అందరూ ఒకే విధంగా కనపడినా వారిలో ఉత్తములు తమ గుణముల చేత వేరుగా వుంటారు.   

No comments:

Post a Comment